యేసు రక్తము రక్తము రక్తము ||2||
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
1. ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము ||2||
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే ||2|| ||యేసు రక్తము||
2. మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము ||2||
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను ||2|| ||యేసు రక్తము||
3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము ||2||
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను ||2|| ||యేసు రక్తము||
Back to list | Sunday songs list
Listen to this song on YouTube