యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది
యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది
ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా ||
1. మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి ||2||
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి ||2|| || యెహోవా ||
2. నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా ||2||
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి ||2|| || యెహోవా ||
3. సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి ||2||
ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము ||2|| || యెహోవా ||
4. చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా ||2||
సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను ||2|| || యెహోవా ||
5. పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా ||2||
పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే ||2|| || యెహోవా ||
Back to list | Sunday Songs list
Listen on YouTube