Vivahamannadi - వివాహమన్నది.



వివాహమన్నది – పవిత్రమైనది

ఘనుడైన దేవుడు ఏర్పరచినది ||2||

1. దేహములో సగ భాగముగా – మనుగడలో సహచారిణిగా ||2||

నారిగా సహకారిగ – స్త్రీని నిర్మించినాడు దేవుడు ||2|| ||వివా||

2. ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని ||2||

శిరసుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు ||2|| ||వివా||

3. దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధిపొందగా ||2||

వేరుగా ఉన్నవారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు ||2||  ||వివా||

Back to List | Sunday Songs List

Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel