విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను॥2॥
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి ॥2॥|| విజయశీలుడా ||
1. అలసిన సమయమున
నా ప్రాణములో త్రాణ పుట్టించినావు ॥2॥
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి
ధైర్యముతో నింపినావు॥2॥
నిత్యానందము కలిగించే నీ
శుభ వచనములతో నెమ్మదినిచ్చితివి॥2॥|| విజయశీలుడా ||
2. ఆశ్చర్యకరముగ నీ బాహువు చాపి
విడుదల కలిగించినావు॥2॥
అరణ్య మార్గమున విడువక తోడై
విజయముతో నడిపినావు॥2॥
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో చేర్చిన దేవా॥2॥|| విజయశీలుడా ||
3. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో
ఆశ్రయమిచ్చితివి నాకు॥2॥
అక్షయుడా నా సంపూర్ణతకై
మహిమాత్మతో నింపినావు॥2॥
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు ॥2॥
Back to list | Sunday Songs list
Listen on YouTube