సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన ||2||
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం ||2|| ||సుమధుర||
1. ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా ||2||
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము ||2|| ||సుమధుర||
2. సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా ||2||
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము ||2|| ||సుమధుర||
3. వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా ||2||
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన ||2|| ||సుమధుర||
Back to list | Sunday songs List
Listen this song on YouTube