స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు యోగ్యుడా -2
నాలో నీవుండగా నీలో నేనుండగా
ఇక నేనేల బయపడుదును - 2 ||స్తుతి||
1. ఆకాశము నీ సింహాసనం భూమి నీ పాద పీఠం -2
ఆ సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చి ప్రాణ త్యాగము చేసి - 2
నీ ప్రేమామృతము త్రాగించితివి
నిన్ను స్తుతించుటకు బ్రతికించితివి -2 ||స్తుతి||
2. రాజాధిరాజ ప్రభువులకు ప్రభువా ఎవరు నీకిలలో సాటి -2
సదాకాలం నిలిచే నీ సింహాసనం జయించినవారికే సొంతం - 2
ఈ జీవన పోరాటంలో
నాకు జయమిచ్చుట నీకే సాధ్యం - 2 ||స్తుతి||
3. నీ రాజ్యము లోక సంబంధమైనది కానేకాదంటివే -2
నా షాలేము రారాజా స్థాపించితివీ నీ బలముతో ప్రేమ రాజ్యం -2
మార్పులేని నీ కృపతో నా ప్రభువా
మార్చితివే నీ రాజ్య పౌరునిగా -2 ||స్తుతి||
Songs List | Sunday Songs
Listen to this Song on YouTube