సృష్టికర్తవైన యెహోవా - నీ చేతిపనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు - మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్నుచూసావు - నీలో నన్ను దాచావు
నిస్వార్థమైన నీప్రేమ - మరణముకంటె బలమైనది నీప్రేమ ||సృష్టికర్తవైన||
1. ఏ కాంతిలేని నిశీధిలో - ఏ తోడులేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో- నన్నాదుకున్న నా కన్న తండ్రివి ||2||
యేసయ్యా నను అనాథగా విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి ||2|| ||సృష్టికర్తవైన||
2. నిస్సారమైన నా జీవితములో - నిట్టూర్పులు నన్ను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకివచ్చి- నన్నాకర్షించిన ప్రేమమూర్తివి ||2||
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రమును నాకు ధరింపజేసితివి ||2|| ||సృష్టికర్తవైన||
Back to list | Sunday Songs list