సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా ||2||
1. నేరం చేయని నీవు ఈ ఘోరపాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు ||2||
కొరడాలు చెళ్ళిని చీల్చెనే నీ సుందర దేహమునే ||2||
తడిపెను నీ తనువును రుధిరంపు ధారలు ||2|| ||సిలువలో||
2. వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే ||2||
దూషించి అపహసించి హింసించిరా నిన్ను ||2||
ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా ||2|| ||సిలువలో||
3. నాదు పాపమె నిన్ను సిలువకు గురిచేసెన్
నాదు దోషమె నిన్ను అణువణువున హింసించెన్ ||2||
నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం ||2||
సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను ||2|| ||సిలువలో||
Back to list | Sunday Songs list
Listen on YouTube