Saswathamainadi Neevu - శాశ్వతమైనది నీవు

శాశ్వతమైనది నీవు నా యెడ చూపిన కృప ||2||
అనుక్షణం నను కనుపాప వలె ||2||
కాచిన కృప                      || శాశ్వత ||

1. నీకు బహుదూరమైన నన్ను
చేరదీసిన నా తండ్రివి ||2||
నిత్య సుఖ శాంతియే
నాకు నీదు కౌగిలిలో  ||2||                   || శాశ్వత ||

2. తల్లి తన బిడ్డలను మరచినా
నేను మరువలేనంటివే ||2||
నీదు ముఖకాంతియే
నన్ను ఆదరించేనులే ||2||                  || శాశ్వత ||

3. పర్వతములు తొలగినను
మెట్టలు తత్తరిల్లిన ||2||
నా కృప నిను వీడదని
అభయమిచ్చితివే ||2||                      || శాశ్వత ||

Back to list | Sunday songs list
Listen to this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel