శాశ్వత కృపను నేను తలంచగా
కానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||
1. నా హృదయమెంతో జీవముగల దేవుని
దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)
నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||
2. దూతలు చేయని నీ దివ్య సేవను
ధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)
ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత||
3. భక్తిహీనులతో నివసించుటకంటెను
నీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)
వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||
4. సీయోను శిఖరాన సిలువ సితారతో
సింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)
సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||
5. నూతనమైన ఈ జీవ మార్గమందున
నూతన జీవము ఆత్మాభిషేకమే (2)
నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||
Back to list | Sunday Songs
Listen to this Song on YouTube