Sarvaadhikaarivi Sarvagnudavu - సర్వాధికారివి సర్వజ్ఞుడవు

సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు ||2||
దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప
మహిమాత్మతో నను నింపితివా ||2||

1. అతీసుందరుడా నా స్తుతి సదయుడ
కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ||2||
ఎనలేనే నీ ఘనకార్యములు తలచి
స్తుతించుచు నిను నే మహిమపరతును ||2||   ||సర్వాధి||

2. బలశౌర్యములుగల నా యేసయ్యా
శతకోటి సైన్యములైనా నీకు సాటి అగుదురా
మారవే నీ సాహసకార్యములు యెన్నడు
ధైర్యముగా నిను వెంబడింతును ||2||   ||సర్వాధి||

3. సర్వజగద్రక్షకూడా - లోకరాజ్యపాలక
భూరాజులెవ్వరినైన నీతో పోల్చగలనా ||2||
బలమైన నీ రాజ్యస్థాపనకై  నిలిచి
నిరీక్షణతో నే సాగిపోదును ||2||   ||సర్వాధి||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel