Sariraarevvaru - సరిరారెవ్వరూ.



సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు ||2||

సర్వము నెరిగిన సర్వేశ్వరునికి

సరిహద్దులు లేని పరిశుద్ధునికి ||2||

సరిరారెవ్వరూ నా ప్రియుడైన యేసయ్యకు ||2||

1. నమ్మదగిన వాడే నలుదిశల నెమ్మది కలుగజేయువాడే ||2||

నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే

నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే ||2||     || సరిరారెవ్వరూ ||

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే ||2||

ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే

నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే ||2||     || సరిరారెవ్వరూ ||

3. పునరుత్థానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే ||2||

శ్రేష్ఠమైన పునరుత్థాన బలము యిచ్చినాడే

నాకై అతిత్వరలో మహిమతో రానైయున్నావాడే ||2||     || సరిరారెవ్వరూ ||


Back to list | Sunday Songs List
List this Song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel