సన్నుతించెదను - దయాళుడవు నీవని
యెహోవా నీవే దయాళుడవని నిను - సన్నుతించెదను ||2||
సన్నుతించెదను - దయాళుడవు నీవని
1. సర్వ సత్యములో నను నీవు నడిపి - ఆదరించిన పరిశుద్ధాత్ముడా ||2||
కృపాధారము నీవెగా షాలేమురాజా - నిను సన్మానించెదను ||2|| ॥సన్ను||
2. నీ కను చూపుల పరిధిలో నన్ను నిలిపి - చూపితివా నీ వాత్సల్యమును ||2||
కృపానిధివి నీవెగా నా యేసురాజా - నిను సన్మానించెదను ||2|| ॥సన్ను||
3.ఇహపరమందున నీకు సాటిలేరయా - ప్రగతిని కలిగించు రాజువు నీవయా ||2||
యూదా గోత్రపు సింహమా రాజాధి రాజా - నిను సన్మానించెధను. ||2|| ॥సన్ను||
Back to list | Sunday Songs list
Listen on YouTube