సద్గుణ శీలుడా నీవే పూజ్యుడవు
స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు
సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి
నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివి ||2||
యేసయ్యా నీ సంకల్పమే
ఇది నాపై నీకున్న అనురాగమే ||2||
1. సిలువ సునాదమును నా శ్రమదినమున
మధుర గీతికగా మదిలో వినిపించి ||2||
సిలువలో దాగిన సర్వసంపదలిచ్చి
కాంతిమయముగా కనపరచితివే నీ ఆత్మ శక్తితో ||2|| || యేసయ్యా ||
2. నాతోడు నీడవై మరపురాని
మహోప కార్యములు నాకై చేసి ||2||
చీకటి దాచిన -వేకువగా మార్చి
బలమైన జనముగా నిర్దారించితివి నీ కీర్తి కొరకే ||2|| || యేసయ్యా ||
3. నా మంచి కాపరివై మమతా సమతలు
మనోహర స్థలములలో నాకనుగ్రహించి ||2||
మారా దాచిన మధురము నాకిచ్చి
నడిపించుచున్నావు సురక్షితముగ నన్ను ఆద్యంతమై ||2|| || యేసయ్యా ||
Back to list | Sunday Songs list
Listen on YouTube