Ruchi Choochi Yerigithini - రుచి చూచి యెరిగితిని

రుచి చూచి యెరిగితిని – యెహోవా ఉత్తముడనియు  ||2||
రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని ||2||

1. గొప్పదేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే ||2||
తప్పక ఆరాధింతు – దయాళుడవు నీవే ||2||

2. మహోన్నతుడగు దేవా – ప్రభావము గలవాడా ||2||
మనసార పొగడెదను నీ – ఆశ్చర్య కార్యములన్‌ ||2||

3. మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో ||2||
ముదమార పాడెద నిన్ను – అతి సుందరుడవనియు ||2||

4. నా జీవితమంతయును – యెహోవాను స్తుతించెదను ||2||
నా బ్రతుకు కాలములో నా- దేవుని కీర్తింతున్‌ ||2||

5. సంతోషించెద నెల్లపుడు – కష్ట ధు:ఖ భాధలలో ||2||
ఎంతో నెమ్మది నిచ్చు నా – రక్షకుడు నాయేసు ||2||

6. ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిదిలో చేరి ||2||
సంపూర్ణముగా పొందెదను – అడుగు వాటన్నిటిని ||2||

7. కృతజ్నత చెల్లింతు – ప్రతి దాని కొరకు నేను ||2||
క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను ||2||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel