రాజ జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను?
1.దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా || రాజ ||
2.బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా || రాజ ||
3.సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా || రాజ ||
Back to list | Sunday songs list