Premamrutham nee sannidhi - ప్రేమామృతం నీ సన్నిధి

ప్రేమామృతం నీ సన్నిధి
నిత్యము నాపెన్నిధి ||2||

1. నీ కృప నన్నాదరించెనులే
భీకర తుపాను సుడిగాలిలో ||2||
కరములు చాచి ననుచేరదీసి
పరిశుద్ధుడా నీ బసచేర్చినావు ||2||  || ప్రేమామృతం ||

2. కమ్మని వెలుగై నీవున్నావులే
చిమ్మచీకటి కెరటాలతో ||2||
చీకటి తెరలు ఛేదించినావు
నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ||2||  || ప్రేమామృతం ||

3. ఎడబాయక నాకు దొరికేవులే
పడబాగ్ని జ్వాలల కడగండ్లలో ||2||
తడబాపు వేళా తొట్రిల్లనీయక
నజరేయుడ నాతో నిలిచావులేయ్ ||2||  || ప్రేమామృతం ||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel