ప్రభువా నీ కలువరి త్యాగము
చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే ||ప్రభువా ||
1. నీ రక్షణయే ప్రాకారములని
ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి ||2||
లోకములోనుండి ననువేరు చేసినది
నీదయా సంకల్పమే ||2|| ||ప్రభువా||
2. జీవపు వెలుగుగ నను మార్చుటకే
పరిశుద్ధాత్మను నాకొసగితివే ||2||
శాశ్వత రాజ్యముకై నను నియమించినది
నీ అనాది సంకల్పమే ||2|| ||ప్రభువా||
3. సంపూర్ణునిగా నను మార్చుటకే
శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే ||2||
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే
నీ నిత్యసంకల్పమే ||2|| ||ప్రభువా||
Back to list | Sunday Songs list
Listen on YouTube