పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు ||2||
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ||2|| ||పరిశుద్ధుడవై||
1. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి ||2||
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||
2. నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి ||2||
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ||ఆరాధన||
3. ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి ||2||
మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు ||ఆరాధన||
Back to list | Sunday Songs list
Listen on YouTube