పావురము వలె దిగిరమ్ము - పాలుతేనే ప్రవహింపనిమ్ము
ఆత్మనాధునివై ఆవరించునదై - నీ మహిమ ఇటు జరగనిమ్ము ||పావురము||
1. మన్నాను యిటు కురువనిమ్ము - అది నీ వాక్యమై మారనిమ్ము ||2||
అది బండలా నా గుండెలో ||2||
జీవజల నదులు పెళ్లుభికి పారంగ ||పావురము||
2. ఈ నేల నీవుమ్మి వేసి - అది నీ చేయి నా కనుల రాచి ||2||
ఈ మందలో పాపాంధులన్ ||2||
నీ మహిమ వెలుగులో నడిచిపో సాగనిమ్ము ||పావురము||
3. జల ప్రళయములే జరుగునాడు - ఒక ఓడాను నడిపించినావు ||2||
రానున్న రాకడ యేదినమో యేనాడో ||2||
ఆ అగ్ని గుండాన పడకుండ కాపాడు ||పావురము||
Back to list | Sunday Songs list