Paadana Mounamugaane Sthuthi Keerthana - పాడనా మౌనముగానే స్తుతి కీర్తన

పాడనా మౌనముగానే స్తుతి కీర్తన
చూడనా ఊరకనే నిలిచి నీ పరాక్రమ కార్యములు ||2||
యేసయ్యా నీతో సహజీవనము
నా ఆశలు తీర్చి తృప్తిపరచెనే||2||         ||పాడనా||

1. ప్రతి ఉదయమున నీ కృపలో నేను ఉల్లసింతునే
నీ రక్తాభిషేకము కడిగెనే
నా ప్రాణాత్మ శరీరమును ||2||
నా విమోచన గానము నీవే
నా రక్షణ శృంగము నీవే ||2||         ||పాడనా||

2. దీర్ఘశాంతము నీ కాడిని మోయుచు నేర్చుకుందునే
నీ ప్రశాంత పవనాలు అణచెనే
నా వ్యామోహపు పొంగులన్నియు ||2||
నా ఓదార్పు నిధివి నీవే
నా ఆనంద క్షేత్రము నీవే ||2||         ||పాడనా||

3. నీ ఆలయమై నీ మహిమను నేను కప్పుకొంటిని
నీ తైలాభిషేకము నిండెనే
నా అంతరంగమంతయును ||2||
నా మానస వీణవు నీవే
నా ఆరాధన పల్లకి నీవే ||2||         ||పాడనా||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel