ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ||2||
**ఎడారి దారిలోన కన్నీటి లోయలోన
నా పక్ష మందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
1.ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుతున్న
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్న ||2||
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ||2||
2.ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణిడు
అన్యాయము చేయుట అసంభవమేగా ||2||
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడా
దుష్కార్యము చేయుట అసంభవమేగా ||2||
3.అవరోధాలెన్నో నాచుట్టూ అలుముకున్న
అవరోధాలోన్నె అవకాశాలను దాచేగా ||2||
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాట యైనను
చరిత్రలో యెన్నటికి తప్పి ఉండలేదుగా ||2||
Back to list | Sunday Songs list
Listen on YouTube