Nuthana Geethamu - నూతన గీతము.


నూతన గీతము నే పాడెదా -మనోహరుడా యేసయ్యా
నీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ
సమర్పణతో సేవించెదను నిన్నే -
సజీవుడనై ఆరాధించెద నిన్నే

1. కొలువుచేసి ప్రేమించినావు –
కోరదగినది ఏముందినాలో-
స్వార్ధ మెరుగని సాత్వీకుడా -నీకు సాటెవ్వరూ (2)
నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను (2) ||నూతన||

2. కడలి తీరం కనబడనివేళ -
కడలి కెరటాలు వేధించువేళ -
కరుణమూర్తిగా దిగివచ్చినా నీకు సాటెవ్వరూ (2)
నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ (2) ||నూతన||

3. మేఘములలో నీటిని దాచి –
సంద్రములలో మార్గము చూపి -
మంటిఘటములో మహిమాత్మ నింపిన -నీకు సాటెవ్వరూ (2)
నీవేనా విజయమూ –నీ మహిమయే నా గమ్యమూ (2) ||నూతన||

Back to List | Sunday songs List
Listen this Song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel