నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది ||2||
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
1. చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను ||2||
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని ||2||
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై || నిరంతరం ||
2. నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి ||2||
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని ||2||
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై ||నిరంతరం||
3. తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి ||2||
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని ||2||
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై ||నిరంతరం||
Back to list | Sunday Songs list
Listen on YouTube