నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును ||2||
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా ||2|| ||నీవు చేసిన||
1. వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా ||2||
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా ||2|| ||ఏడాది||
2. మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో ||2||
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా ||2|| ||ఏడాది||
3. విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును ||2||
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను ||2|| ||ఏడాది||
4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నీకేమి చెల్లింతును ||2||
కపట నటనాలు లేనట్టి హృదయాన్ని
అర్పించినా చాలునా ||2|| ||ఏడాది||
Back to list | Sunday Songs list
Listen on YouTube