నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను ||2||
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
1. జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట ||2||
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా ||2||
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా ||2|| ||నీ కృప||
2. జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా ||2||
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే ||2||
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను ||2|| ||నీ కృప||
Back to List | Sunday Songs
Listen to this song on Youtube