నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా
నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా ||2||
నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి
యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ ||2|| || నీ బాహుబలము ||
1. ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి
దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి ||2||
అవమానించినవారే అభిమానమును పంచగా
ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం ||2|| || నీ బాహుబలము ||
2. సారవంతమైన తోటలో నను నాటితివి
సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి ||2||
చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై
ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును ||2|| || నీ బాహుబలము ||
3. వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ
పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు ||2||
శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు
గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును ||2|| || నీ బాహుబలము ||
Back to list | Sunday Songs list
Listen on YouTube