నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా ||2||
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా ||2||
ఇంకేమి కోరుకోనయ్యా ||2|| ||నమ్మకమైన||
1. ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా ||2||
న్యాయము తీర్చే నీవు నాకుంటే ||2||
చాలు యేసయ్యా ||2|| ||నమ్మకమైన||
2. జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా ||2||
శాపము బాపే నీవు నాకుంటే ||2||
చాలు యేసయ్యా ||2|| ||నమ్మకమైన||
3. కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా ||2||
సాయము చేసే నీవు నాకుంటే ||2||
చాలు యేసయ్యా ||2|| ||నమ్మకమైన||
Back to list | Sunday Songs list
Listen on YouTube