నమ్మదగిన వాడవు సహయుడవు యేసయ్య
ఆపత్కాలములో ఆశ్రయమైనది నీవేనయ్య ||2||
చెర నుండి విడిపించి చెలిమితొ బంధించి
నడిపించినావె మందవలె నీ స్వాస్ద్యమును ||2|| || నమ్మదగిన ||
1. నీ జనులకు నీవు న్యాయధిపతివైతివే
శత్రువుల కోటలన్ని కూలిపోయెను
సంకేళ్ళు సంబరాలు ముగబోయెను ||2||
నీరిక్షణ కర్తవైన నిన్నే నమ్మిన ప్రజలు
నిత్యానందభరితులే సియోనుకు తిరిగివచ్చెను ||2|| || నమ్మదగిన ||
2. నీ ప్రియులను నీవు కాపాడే మంచి కాపరి
జఠిలమైన త్రోవలన్ని దాటించితివి
సమృద్ధి జీవముతో పోషించితివి ||2||
ఆలోచన కర్తవైన నీ స్వరమే వినగా
నిత్యాదరణను పొంది నీ క్రియలను వివరించెను ||2|| || నమ్మదగిన ||
3. నా బలహీనతయందు శ్రేష్టమైన కృపనిచ్చితివి
యోగ్యమైన దాసునిగ మలచుకొంటివి
అర్హమైన పాత్రగనను నిలుపుకొంటివి ||2||
ఆదరణ కర్తవై విడువక తోడైనిలిచి
సర్వోత్తమమైన మార్గములో నడిపించుము ||2|| || నమ్మదగిన ||
Back to list | Sunday Songs List