నాలో నివసించే నా యేసయ్య
మనోహర సంపద నీవేనయ్యా ||2||
మారని మమతల మహనీయుడ ||2||
కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా -
మనసారా నిన్నే ప్రేమింతునయ్యా ||2|| ||నాలో నివసించే||
1. మధురమైనది నీ స్నేహబంధం - మహిమగా నన్ను మార్చిన వైనం ||2||
నీ చూపులే నన్ను కాచెను - నీ బాహువే నన్ను మోసేను ||2||
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చను ||2|| ||కీర్తించి||
2. వినయ భావము ఘనతకు మూలము - నూతన జీవములో నడుపు మార్గం ||2||
నా విన్నపం విన్నవులే - అరుదేంచేనే నీ వరములే ||2||
ఏమని వర్ణింతును నీ కృపలను ||2|| ||కీర్తించి||
3. మహిమ గలది నీ దివ్య రాజ్యం - తేజోవాసుల పరిశుద్ద స్వాస్థ్యం ||2||
సియోనులో చేరాలనే - నా ఆశయం నెరవేర్చుము ||2||
యేసయ్య నిన్ను చూచి హర్షింతును
భువినేలు రాజ నీకే నా వందనం - దివినేలు రాజ వేలాది వందనం ||2|| ||నాలో నివసించే||
Back to list | Sunday Songs list
Listen on YouTube