Naaku Nee Krupa Chaalunu - నాకు నీ కృప చాలును

నాకు నీ కృప చాలును ప్రియుడా
నాకు నీ కృప చాలును (2)
శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)

1. జతలేని పావురము వలెనే
మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు (2)
నాధా నీ రాకా ఆలస్యమైతే (2)
పడకుండా నిలబెట్టుము - నన్ను జారకుండా కాపాడును (2)

2. సింహపు బోనులో నన్ను వేసినను
అగ్ని మధ్యలో పడవేసినను (2)
హృదయము కలవరపడు సమయములో (2)
పడకుండా నిలబెట్టుము - నన్ను జారకుండా కాపాడును (2)

3. ఒక మనుష్యుడు లేడు ఆశ్రయించుటకు
ఆదరణ పొందుటకు స్థలము లేదు (2)
సంపూర్ణ జీవము కలిగిన నాధా (2)
నీవే నా ఆదరణ - భువిలో నీవే నా ఆధారము (2)

Back to list | Sunday Songs list
Listen on
YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel