నా రాగము నీవే కదా - నా గానము నీవే కదా ||2||
నా పాటకు పల్లవి నీవే కదా ||2||
నా ప్రతి పదములో నీ నామమును గూర్చి
స్తుతి గానమే పాడనా - నీకోసమే పాడనా
యేసయ్య నీకోసమే పాడనా
1. మాటలు రాని అకాశపక్షులకు - సరిగమలు నేర్పినది నీవేకదా
శృతి చేసితివి నా జీవితమును - పూర్ణ మనసుతో ఆరాధించుటకు
జీవింతునయ్యా నీ సాక్షిగా ఇలలో నీ కృప తోడుండగా
2. నామది నిండిన రక్షణ ఆనందమే - అది అణువు అణువు నీ ప్రేమ నే పాడేనే
తంబుర సితార నాదముతో నీకృపను - గానము చేసెద సంతోష భరితుడనై
నా స్తోత్ర గీతమ ఆరాధ్యదైవమా - నా విజయ సంకేతమా
3. ఎందరు ఉన్న ఒంటరివాడనని నా జంటగా నీవు నిలిచావయ్యా
ఎవరు విడదియ్యా లేనంతగా నన్ను - నీ ప్రాణముతో పెనవేసుకొంటివి
నీ సిలువ దర్శనం అది మరపురానిది - నిత్యము ధ్యానించెద
Back to list | Sunday Songs list
Listen on YouTube