నా ప్రార్థనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతుము
నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు - 2 || నా ప్రార్థనలన్ని ||
అడిగినంతకంటె అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా - 2
పరిపూర్ణమైన నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే శుభ ఆనవాలు - 2 || నా ప్రార్థనలన్ని ||
ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా } 2
సమీప భాందవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహబంధము - 2 || నా ప్రార్థనలన్ని ||
ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా - 2
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిరపునాదులు - 2 || నా ప్రార్థనలన్ని ||