Naa Jeevithaana Kurisene - నా జీవితాన కురిసెనే

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం ||2||
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ||2||

1. నీ దయ నుండి దూరము కాగా
ప్రేమతో పిలిచి పలుకరించితివే ||2||
కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను   ||2||      || నా జీవితాన ||

2. నా యేసయ్యా - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడదగినది ||2||
కృపయేనా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది   ||2||      || నా జీవితాన ||

3. నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరిచేరనివ్వవు ||2||
కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను   ||2||      || నా జీవితాన ||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel