Naa Jeevitha Baagaswamivi - నా జీవిత భాగస్వామివి.

నా జీవిత భాగస్వామివి నీవు
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు ||2||
నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా ||2||

1. నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి ||2||
నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
నీ సైన్యములో నన్ను చేర్చితివి ||2|| || నా జీవిత ||

2. నీ దయగల మాటలే చేరదీసినవి
నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి ||2||
నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
నీ విందుశాలకు నను చేర్చితివి ||2|| || నా జీవిత ||

3. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి ||2||
నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
నీ అంతఃపురములో నను చేర్చుదువు ||2|| || నా జీవిత ||

Back to list | Sunday songs List
Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel