నా హృదయాన కొలువైన - యేసయ్యా
నా అణువణువు నిన్నే - ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణలో - ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజారుడా
1. అగ్ని ఎడంతలై - మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే - నీ ప్రియుల దేహాలను ||2||
అగ్ని బలము చల్లారినే - శత్రు సమూహము అల్లాడెనే ||2||
నేను నీ స్వాస్థ్యమే - నీఫు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా ||2|| || నా హృదయాన ||
2. అంతా వ్యర్ధమని వ్యర్ధులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే - నా పరుగు సార్ధకమాయనే ||2||
నీయందు పడిన ప్రయాసము - శాశ్వత కృపగా ||2||
నాయందు నిలిచెనే నీపై విశ్వాసమే - నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును ||2|| || నా హృదయాన ||
3. విత్తినది ఒకరు - నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైనను - వృద్ధి చేసింది నీవే కదా ||2||
సంఘ క్షేమాభివృద్ధికే - పరిచర్య ధర్మము ||2||
నియమించినావే నీ ఉపదేశమే నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును ||2|| || నా హృదయాన ||
Back to list | Sunday Songs list
Listen on YouTube