Naa Deepamu Yesayya - నా దీపము యేసయ్యా

నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము ||2||

1. ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై ||2||
చేసావు పండుగ వెలిగావు నిండుగా ||2||        ||నా దీపము||

2. మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది ||2||
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా ||2||        ||నా దీపము||

3. ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై ||2||
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా ||2||        ||నా దీపము||

Back to list | Sunday songs list
Listen to this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel