మాట ఇచ్చి తప్పనివాడవు నీవే యేసయ్య
వేనోళ్ళ స్తుతించిన నీ ఋణము తీరదయ్య - 2
వాగ్దానాపూర్ణుడ దయగల నీ మాటలతో
ఇన్నాళ్లు ఇలలోనే బ్రతుకుచుంటిని -2
1. నీ మాటకునే విధేయుడనై
కుడివైపున వల విసిరిన వెంటనే - 2
విస్తారమైన దీవెనలతో నన్ను నింపితివే -2
నీ ఆజ్ఞల మార్గములో నడచి పొందెద ఇంకెన్నో మేలులు -2. ||మాట||
2. నీ చిత్తమునే చేయుట కొరకే
ఉన్నత పిలుపుతో నన్ను పిలిచి - 2
విస్తారమైన ప్రజలకు దీవెనగా నిలిపితివే - 2
నీ పిలుపును కాపాడుకొనుచు నే సాగేద తుది శ్వాస వరకు - 2. ||మాట||
3. నీ మాటకాదని ఎటుపోగలను
కంటికి ఎవరు కానరాని చీకటిలో -2
నను నడిపించుటకు ధ్రువతారగా నాలో వెలసితివే - 2
నీ కుడిచేతిలో తారగా వెలుగుచు ప్రకటించేదానిన్నే ప్రతి క్షణము - 2 ||మాట||
Back to list | Sunday songs
Listen to this song on YouTube