ఇన్నేళ్లుగా కన్నీరు తుడిచి - కాపాడిన ఓ ప్రభువా ||2||
శోధన సమయములోనా... వేదన కాలములోనా ... ||2||
1. జడివానలూ సుడిగాలులూ - కురిసాయి నా బ్రతుకులోనా ||2||
నా చెంత చెరీ , చేయూత నిచ్చి ||2||
కాపాడిన ఓ ప్రభువా ,
మమ్ము కాపాడిన ఓ ప్రభువా ||ఇన్నేళ్లుగా||
2. నా వారలే వెలివేసిన - పగవారు తలలూచినా ||2||
నీ దరికీ చేర్చి, ఓదార్పు నిచ్చి ||2||
ననాదరించవు ప్రభువా,
నీవు ననాదరించవు ప్రభువా ||ఇన్నేళ్లుగా||
3. సాతానుడు శోదించగా - నా దేవ జయమిచ్చినావూ ||2||
పలుమారులు ప్రార్ధించగా ||2||
పడకుండ కాపాడినావు,
నన్ను పడకుండ కాపాడినావు ||ఇన్నేళ్లుగా||
Back to list | Sunday Songs list