Entha Krupaamayudavu Yesayya - ఎంత కృపామయుడవు యేసయ్యా

ఎంత కృపామయుడవు యేసయ్యా
(నీ) ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా ||2||  
నలిగితివి వేసారితివి ||2||  
నాకై ప్రాణము నిచ్చితివి ||2||       ||ఎంత||

1. బండలాంటిది నాదు మొండి హృదయం
ఎండిపోయిన నాదు పాత జీవితం ||2||  
మార్చినావు నీ స్వాస్థ్యముగా ||2||  
ఇచ్చినావు మెత్తనైన కొత్త జీవితము ||2||       ||ఎంత||

2. కన్న తల్లి తండ్రి నన్ను మరచిననూ
ఈ లోకము నన్ను విడచిననూ ||2||  
మరువలేదు నన్ను విడువలేదు ||2||  
ప్రేమతో పిలచిన నాథుడవు ||2||       ||ఎంత||

Back to list | Sunday Songs list
Listen on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel