దావీదు కుమారుడా - నను దాటిపొకయా
నజరేతువాడా - నను విడిచిపోకయా
నీవు తప్ప నాకీలోకంలో ఎవరున్నారయా
నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా
1. గ్రుడ్డి వాడినయ్యా - నా కనులు తెరువవా
మూగవాడినయ్యా - నా స్వరము నియ్యవా ||2||
కుంటి వాడినయ్య - నా తోడు నడువవా ||2|| ||దావీదు||
2. లోకమంత చూసి - నను ఏడిపించినా
జాలితో నన్ను - నీవు చేరదీయవా ||2||
ఒంటరి నయ్యా - నాతోడు నిలువవా ||2|| ||దావీదు||
3. నా తల్లి నన్ను - మరచిపోయిన
నా తండ్రి నన్ను - విడిచిపోయిన ||2||
తల్లితండ్రి నీవై నను లాలించుమా ||2|| ||దావీదు||
Back to list | Sunday Songs list
Listen on YouTube