Devuni yandu Neerikshana nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి

దేవునియందు నిరీక్షణ నుంచి
ఆయనను స్తుతించు నా ప్రాణమా ||2||

1. ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు ||2||
ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు ||2||      ||దేవుని||

2. చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు ||2||
సత్యమగు – జీవమగు – మార్గమేసే ||2||      ||దేవుని||

3. తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను ||2||
తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు ||2||      ||దేవుని||

4. నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే ||2||
ఆధారము – ఆదరణ – ఆయనలో ||2||      ||దేవుని||

5. నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు ||2||
శత్రువులు – మిత్రులుగా – మారుదురు ||2||      ||దేవుని||

6. పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు ||2||
కనికర – సంపన్నుడు – నా దేవుడు ||2||      ||దేవుని||

7. స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద ||2||
హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ ||2||      ||దేవుని||

Back to list | Sunday songs list
Listen to this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel