Devuni Samukha Jeeva kavilalo - దేవుని సముఖ జీవ కవిలెలో

దేవుని సముఖ జీవ కవిలెలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

1. జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే ||2||
హత సాక్షుల కవిలెలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

2. ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన ||2||
విజయవీరుల కవిలెలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

3. పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు ||2||
సర్వోన్నతుని పురములలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

4. దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన ||2||
ప్రార్ధన వీరుల కవిలెలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

5. పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా ||2||
పరిశుద్ధుల కవిలెలో ||2||
నీ పేరున్నదా – నీ పేరున్నదా     ||దేవుని||

Back to list | Sunday Songs list

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel