అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును ||2||
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా ||అతి పరిశుద్ధుడా||
1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ||2||
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం ||2||
నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి ||2|| ||అతి పరిశుద్ధుడా||
2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని – గడిచిన కాలం
సాగిన పయనం నీ కృపకు సంకేతమే ||2||
కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా ||2||
నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా ||2|| ||అతి పరిశుద్ధుడా||
3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక – శోధనలెన్నో
ఎదిరించినను నను సోలిపోనివ్వక ||2||
ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున ||2||
నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి ||2|| ||అతి పరిశుద్ధుడా||
Back to list | Sunday Songs list
Listen on YouTube