ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు ||2||
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు ||2||
1. సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా ||2||
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||
2. విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు ||2||
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||
3. చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె ||2||
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||
Back to list | Sunday Songs List
Listen to this Song on YouTube