ఆరాధించుటకు నీ నామమేగాక - వేరొక నామము లేదాయే
యేసయ్య... తరతరములకు నీవే మాదేవుడవు
1. నీ నామమున ప్రార్ధన చేయు
జనులను విడిపించి నడిపించినావు ||2||
పాలుతేనెలు ప్రవహించు దేశములో
క్షేమముగానే నివసింపచేసితివి ||2||
నమ్మదగిన దేవుడవు నీవే
సాటిలేరు ఇలలో నీకెవ్వరూ ||2|| ||ఆరాధించుటకు||
2. ఆ కాలములో పరజనులము మేము
నిజమైన దేవుని ఎరుగనివారము ||2||
ఈ కృపాకాలములో ప్రభువా
నీ రక్తము ద్వారా సంధి చేసితివి ||2||
తండ్రితో మేము ఐక్యపరచితివి
నిబంధన జనులని ముద్రవేసితివి ||2||
3. నీ సంఘములో స్తుతి ఆరాధనలో
రుచిచూపితివి పరిశుద్దాత్మను ||2||
నాలో నివసించి నాతోడుగా నడిచే
పరిశుద్దాత్ముని ఆదరణ పొందితిని ||2||
ఇహపరమందున ఇక నా సహవాసము
తండ్రి కుమార పరిశుద్దాత్మునితో ||2||
Back to list | Sunday Songs list
Listen on YouTube