నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ ||2||
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను ||2||
స్తుతియించుట మానను
1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా ||2||
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ ||2||
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ ||2|| ||అంతా||
2. ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా ||2||
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను ||2||
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక ||2|| ||అంతా||
3. అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున ||2||
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు ||2||
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు ||2|| ||అంతా||
4. ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును ||2||
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా ||2||
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ ||2|| ||అంతా||
5. చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా ||2||
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు ||2||
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు ||2|| ||అంతా||
6. సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును ||2||
యేసుని సారూప్యము – నేను పొందాలని ||2||
అనుమతించిన ఈ – విలువైన సిలువకై ||2|| ||అంతా||
7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును ||2||
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే ||2||
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే ||2|| ||అంతా||
Back to list | Sunday Songs list
Listen on YouTube