Anni naamamulakanna - అన్ని నామముల కన్న.

అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము (2)

యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ (2)

1. పాపముల నుండి విడిపించును
యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము (2)                         ||యేసు నామము ||

2. సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము (2)
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము (2)              ||యేసు నామము ||

3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము (2)
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము (2)                 ||యేసు నామము ||

Back to list | Sunday Songs
Listen this song on YouTube

Intuit Mailchimp logo
Facebook icon
Instagram icon

© 2022 Emmanuel