అమరుడవు నీవు నాయేసయ్యా
ఆదియు అంతము నీవేనయ్యా ||2||
ఆదిలోనున్న నీ వాక్యమే
ఆదరించెను శ్రమకొలిమిలో ||2||
సొమ్మసిల్లక - సాగిపోదును - సీయోను మార్గములో
స్తోత్రగీతము - ఆలపింతును - నీదివ్య సన్నిధిలో ||అమరుడవు||
1. శక్తికి మించిన సమరములో - నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ - ఉన్నత కృపతో నను నింపుటకే ||2||
ప్రతి విజయము నీకంకితం - నాబ్రతుకే నీ మహిమార్థం
లోకమంతయు - దూరమైనను - నను చేరదీసెదవు
దేహమంతయు - ధూళియైనను - జీవింపజేసెదవు ||అమరుడవు||
2. వేకువకురిసిన చిరుజల్లులో - నీకృప నాలో ప్రవహించగా -
పొందితినెన్నో ఉపకారములు - నవనూతనమే ప్రతిదినము ||2||
తీర్చగలనా నీ ఋణమును - మరువగలనా నీ ప్రేమను
కన్నతండ్రిగ - నన్ను కాచి - కన్నీరు తుడిచితివి
కమ్మనైన - ప్రేమ చూపి - కనువిందు చేసితివి ||అమరుడవు||
3. జల్దరు వృక్షమును పోలిన - గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలిచిన పరిశుద్ధుడవు - పునరుత్థానుడవు నీవయ్యా||2||
జయశీలుడవు నీవేనని - ఆరాధింతును ప్రతి నిత్యము
గుండె గుడిలో - నిండినావు - నీకే ఆరాధన
ఆత్మదీపము - వెలిగించినావు - నీకే ఆరాధన ||అమరుడవు||
Back to list | Sunday songs list
Listen to this song on YouTube