అల్ఫా ఓమేగయైన మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రార్హుడా ||2||
రాత్రిలో కాంతి కిరణమా! పగటిలో కృపా నిలయమా!
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమైనా సౌఖ్యమై నను నడిపించే నా యేసయ్యా ||2||
1 .కనికర పూర్ణుడా! నీ కృప బాహుల్యమే
ఉన్నతముగ నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతి లో నిలిపి
నూతన వసంతములో చేర్చును ||2||
జీవించెద నీ కొరకే – హర్షించెద నీ లోనే ||2|| ||అల్ఫా||
2 తేజోమయుడా! నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశా నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగ నను చేసెను ||2||
నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాధన నీకే ||2|| ||అల్ఫా||
3 నిజ స్నేహితుడా! నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతు లేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను ||2||
నా చెలిమి నీతోనే – నా కలిమి నీలోనే ||2|| ||అల్ఫా||
Back to list | Sunday Songs list
Listen on YouTube